ATP: జిల్లా నగర శివారులోని కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు భారీగా తగ్గి కిలో గరిష్ఠంగా రూ.17, కనిష్ఠంగా రూ.8 ఉండగా, సరాసరి ధర రూ.12గా ఉందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి రూప్ కుమార్ తెలిపారు. రైతులు పెద్ద మొత్తంలో టమాటా మార్కెట్కు తీసుకురావడంతో సరఫరా పెరిగి ధరలు పడిపోవడం వల్ల వారికి నష్టాలు వాటిల్లుతున్నాయి.