AP: రాజధాని అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మోసపూరితమని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. సజ్జల వెనుక ఉండి జగన్ను ప్రభావితం చేస్తుంటారని ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో జగన్ వైఖరి మారినట్లు సజ్జల చెప్పినా ప్రజలు నమ్మరని తెలిపారు. అమరావతే ఏకైక రాజధాని అని సజ్జల చెప్పడం కాదు.. ఆ విషయాన్ని స్వయంగా జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.