BDK: చర్ల గాంధీ బొమ్మ సెంటర్లో ప్రతినిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు తిరగడం వల్ల రోడ్లన్నీ ధ్వంసమై ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు గానీ రాజకీయ నాయకులు గానీ పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన పలక రమేష్, తన సొంత ఖర్చులతో శనివారం రాత్రి గుంతలను పూడ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.