MDK: నార్సింగి 44వ జాతీయ రహదారి జప్తి శివునూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఒక లారీ అతివేగంగా ముందు వెళ్తున్న మరో లారిని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ అనే లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.