W.G: నరసాపురం-సఖినేటిపల్లి మధ్య గోదావరిలో నడిచే ఓ పంటు అదుపుతప్పి ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధిక లోడు కారణంగానే పంటు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. పంటు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి దానిని ఒడ్డుకు చేర్చడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.