గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా చేసిన దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా గాజాలోని బహుళ అంతస్తుల భవనాలను ఇజ్రాయెల్ నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే గాజా సిటీని ఖాళీ చేయమని అక్కడి పౌరులను ఐడీఎఫ్ హెచ్చరించింది.