SKLM: ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలో శనివారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఏడు రోడ్లు జంక్షన్ రహదారి సమీపంలో ట్రాఫిక్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పలు వాహనాలను తనిఖీలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు గురించి అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపే వాహనదారులను హెచ్చరించారు.