GNTR: తెనాలిలోని పాత స్వరాజ్ టాకీస్-ముత్యంశెట్టిపాలెం వెళ్లే మలుపు వద్ద భారీ వృక్షం కూలిపోయింది. నిన్న కురిసిన భారీ వర్షానికి చెట్టు కింది భాగం పూర్తిగా నాని రాత్రి విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో అటుగా వెళ్తున్న మినీ లారీ మీద చెట్టు కొమ్మలు పడటంతో అద్దం స్వల్పంగా ధ్వంసం అయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.