»Janhvi Kapoor Another Chance For Janhvi Kapoor This Time With A Natural Star
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కి మరో ఛాన్స్.. ఈసారి న్యాచురల్ స్టార్‌తో?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు తెలుగులో యమా క్రేజ్ ఉంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే.. వరుస ఆఫర్స్ అందుకుంటోంది. లేటెస్ట్గా న్యాచురల్ స్టార్ నానితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Janhvi Kapoor: Another chance for Janhvi Kapoor.. this time with a natural star?
Janhvi Kapoor: హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే.. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాలో నటిస్తోంది జాన్వీ. టాలీవుడ్లో అమ్మడికి ఇదే ఫస్ట్ సినిమా. ఇందులో తంగం అనే పాత్రలో కనిపించనుంది జాన్వీ. సెప్టెంబర్ 27న దేవర మొదటి భాగం రిలీజ్ కానుంది. కానీ ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఛాన్స్ కొట్టేసింది జాన్వీ. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్సీ 16లో హీరోయిన్గా నటిస్తోంది జాన్వీ.
ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉండగానే.. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానితో నటించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు. అంటే సుందరానికి సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా అయిపోయింది. ఆగష్టు 29న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి దసరా కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు నాని.
దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేశాడు నాని. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి ఈ మాస్ కాంబో ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జాన్వీ అయితే.. బాలీవుడ్లో కూడా కలిసొస్తుందని భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా.. జాన్వీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి.