NDL: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాణ్యం మండలం శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో సీఐ కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం విద్యార్థులకు డ్రగ్స్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్ల అనర్థాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వల్ల కలిగే రోగాలు, ర్యాగింగ్ వల్ల జీవితాలు నాశనమయ్యే విధానం గురించి వివరించారు. సైబర్ నేరాల పట్ల స్వీయ అప్రమత్తతే ముఖ్యమని ఆయన సూచించారు.