GDWL: జిల్లాలో మహిళా శక్తి పథకం కింద మహిళా సమైక్య సంఘాలకు ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంకు కోసం స్థలంను అధికారులు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మానవపాడు మండలం నారాయణపురం గ్రామం శివారులోని సర్వే నంబర్ 36 అసైన్డ్ భూమిని శుక్రవారం జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఆర్డివో నర్సింగరావుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.