అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకు BBC ఆయనకు క్షమాపణలు చెప్పింది. ఆ ప్రసంగాన్ని సవరించినందుకు తాను, BBC సంస్థ చింతిస్తున్నట్లు ఛైర్మన్ సమీర్ షా శ్వేతసౌధానికి లేఖ రాశారు. ట్రంప్ డిమాండ్ చేసిన బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇచ్చేందుకు నిరాకరించామని ఈ సందర్భంగా BBC పేర్కొంది.