అన్నమయ్య: రాయచోటి పట్టణం చలంపల్లె రింగ్ రోడ్డులో శుక్రవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్కిరెడ్డిపల్లి మండలం రెడ్డివారిపల్లెకు చెందిన కావలి నాగేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. సుండుపల్లెలోని హౌసింగ్ శాఖలో పనిచేస్తున్న నాగేంద్ర పని ముగించుకుని స్వగృహానికి బైక్పై వస్తుండగా చలంపల్లె వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు.