E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామ దేవత బంగారు పాపమ్మ ఉత్సవాలు శనివారం నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏటా కార్తీక మాసం ముగింపులో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.