ATP: ఆధార్ స్పెషల్ క్యాంప్‌లను ఈనెల 17 నుంచి 26వ వరకూ నిర్వహిస్తున్నట్లు కల్యాణదుర్గం ఎంపీడీవో ధనుంజయనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని కోడిపల్లి, నారాయణ పురం గ్రామాల్లో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఆధార్, మార్పులు, చేర్పులు ఉన్న వారు ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.