KNR: బొమ్మకల్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. దుర్శేడ్‌కు చెందిన చరణ్, గోపాల్‌పూర్‌కు చెందిన లోకేష్, ఓ మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి 260 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, గంజాయి విక్రయం చేస్తున్నట్లు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశారు.