AP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రేపు విజయవాడకు రానున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.