TG: ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందుకోసం ఎంత ఖర్చయినా చెల్లించేందుకు వెనుకాడరు. తాజాగా నిన్న ఆర్టీఏ ఖైరతాబాద్ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో రవాణా శాఖ పంట పండింది. 11 నంబర్లకు నిర్వహించిన వేలంలో రూ.65,38,889 ఆదాయం వచ్చింది. TG09H9999 నంబర్ కోసం హానర్ ప్రైమ్ హౌసింగ్ LP అనే కంపెనీ ఏకంగా రూ. 22,72,222 వేలం పాట పాడి కైవసం చేసుకుంది.