SRPT: సమాజంలో క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ నరేష్ కోరారు. శుక్రవారం గరిడేపల్లిలోని ప్రాథమిక వైద్యశాలలో క్షయ వ్యాధి నివారణ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.