GNTR: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ శుక్రవారం మెరుపుదాడులు చేసింది. ఫిరంగిపురం, తక్కెళ్లపాడు గ్రామాల్లో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి, వారి రూ. 1,21,120 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మంగళగిరి రూరల్ పరిధిలోని నవులూరులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది.