ప్రకాశం: వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత త్రాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.