ELR: భీమడోలు మండలం పూళ్లలో 2007లో జరిగిన హత్య కేసులో గుడివాడకు చెందిన నిందితుడు స్టీవెన్‌ను పోలీసులు శుక్రవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. స్టీవెన్ ఏడేళ్ల నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన CI విల్సన్, SI మదీనా బాషా, హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, సురేష్‌ను SP ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసించారు.