టిబెట్లో అర్థరాత్రి 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఓ ప్రకటనలో ధృవీకరించింది. NCS సమాచారం ప్రకారం, ఈ భూకంపం భూమిలోపల 60 కి.మీ లోతులో సంభవించింది. ఈ భూకంపం వల్ల కలిగిన నష్టం గురించి తెలియాల్సి ఉంది. కాగా, ఈనెల 11వ తేదీన కూడా టిబెట్లో 10 కి.మీ లోతులో 3.8 తీవ్రతతో మరో భూకంపం నమోదైన విషయం తెలిసిందే.