జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నౌగామ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ భవనం, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భద్రతా దళాలు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.