ATP: శింగనమల మండలంలో ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పంటల ఈ–పంట వివరాలు ఈ నెల 16 వరకు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని వ్యవసాయ అధికారి అన్వేష్ తెలిపారు. రైతులు ఈ వివరాలను సరిచూసుకుని తప్పులు కనిపిస్తే వెంటనే తెలియజేస్తే సరిదిద్దుతామని చెప్పారు. మండలంలోని ప్రతి రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.