Amala Paul: చరణ్, బన్నీ హీరోయిన్ పెళ్లై రెండు నెలలే.. కానీ మూడో నెల?
ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోయిన్లు షాక్ ఇస్తున్నారు. పెళ్లి, లవ్, ఎఫైర్.. అంటూ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. అయితే పెళ్లి చేసుకున్న నెలల కంటే ప్రెగ్నేన్సి టైమే ఎక్కువ అని చెప్పి మరింత షాక్ ఇస్తున్నారు. తాజాగా బన్నీ హీరోయిన్ మూడో నెల అంటూ చెప్పుకొచ్చింది.
Amala Paul: కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త పద్ధతిగా కనిపించి.. రాను రాను న్యూడ్‌గా నటించి షాక్ ఇచ్చిన కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ అందరికీ తెలిసిందే. తెలుగులో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. రామ్ చరణ్‌తో ‘నాయక్’ సినిమాలో కూడా నటించింది. మైనా అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన అమలా పాల్.. మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకుంది. ఈ సినిమా తరువాత తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ మంచి పీక్ స్టేజీలో ఉన్నప్పుడే డైరెక్టర్ AL విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే విబేధాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత జగత్ దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అమలా పాల్. గతేడాది నవంబర్‌లో వీరి పెళ్లి జరిగింది. అంటే.. ఈ పెళ్ళి జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. కానీ అప్పుడే మేము ముగ్గురం కాబోతున్నామని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అందులో అమలా పాల్ రెడ్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని భర్త జగత్ దేశాయ్ గుండెలో తను ఉన్నట్లుగా ఫొటో షేర్ చేసింది.
మరో ఫొటోలో బేబీ బంప్ పట్టుకుని ఫొటోకు పోజు ఇచ్చింది. మరో ఫొటోలో అమలా పాల్ కాళి వేళ్లపై నిల్చుని జగత్ దేశాయ్‌ను కిస్ చేస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టుకు ‘నీతో 1+1= 3 అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది.. అని క్యాప్షన్ రాసుకొచ్చింది అమలా పాల్. దీంతో.. పెళ్లి అయ్యి రెండు నెలలే కదా అయ్యింది.. అప్పుడే మూడో నెల ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం అమలా పాల్ కొన్ని మళయాళ, తమిళ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది.