»Mla Raja Singh Ramas Picture Should Be Printed On Rs 500 Notes
MLA Raja Singh: రూ.500 నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలి
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న ఘనంగా నిర్వహించనున్నారు. ఈక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు.
MLA Raja Singh: అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠను ఘనంగా నిర్వహించనున్నారు. ఈక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్‌లాండ్ సహా పలు యూరప్ దేశాల్లో ఇప్పటికే కరెన్సీ నోట్లపై హిందూ దేవుళ్ల ఫొటోలను ముద్రించారని.. రూ.500 నోట్లపై రాముడి ఫొటోలను ముద్రించాలని డిమాండ్ చేశారు. నోట్లపై రాముడి చిత్రాన్ని ముద్రించాలని.. ఇది వంద కోట్ల మంది హిందువుల కోరిక అని తెలిపారు. ఇండోనేషియాలో ఏకంగా 80 శాతం ముస్లింలు ఉన్నారు. అక్కడి కరెన్సీపై హిందూ దేవతల ఫొటోలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని శంభాజీపూర్లో రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపారు.
దేశంలోని వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములను విడుదల చేయాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. దేశ విభజన సమయంలో ఇక్కడి జనాలను హతమార్చిన వారి ఆస్తులను కాపాడేందుకు నెహూ ప్రభుత్వం వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందని విమర్శించారు. మహారాష్ట్రలో 10 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పేరుతో ఉందని వివరించారు. 2009 వరకు 4 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉండేదని.. అది క్రమంగా 10 లక్షల ఎకరాల వరకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ భూములను విడుదల చేయాలని లేదంటే కోర్టులో పిటిషన్ వేస్తామని హెచ్చరించారు.