బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది IPL మజా ఇక కలగానే మిగలనుంది. IPL-2026 బ్రాడ్కాస్ట్ అగ్రిమెంట్‌ను జియో హాట్‌స్టార్ అనూహ్యంగా రద్దు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రసారాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం రావడం చర్చనీయాంశమైంది. దీంతో అక్కడి ప్రేక్షకులు IPL లైవ్ ధమాకాను వీక్షించే సువర్ణావకాశాన్ని కోల్పోయారు.