అన్నమయ్య: రామసముద్రం మండలంలో కురుస్తున్న దట్టమైన పొగమంచు కప్పేసింది. ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో పొగమంచు కొంత ఊరట ఇచ్చింది. ఒక పక్క విపరీతమైన ఉక్కపోత ఉండగా మరో పక్క పొగమంచు ప్రజలను చల్లబరుస్తోంది. ఉదయం 8 గంటలైన పొగమంచు తగ్గలేదు. రైతులు, కూలీలు, విద్యార్థులు, వాహనదారులు పొగమంచును ఆస్వాదించారు.