»Tsrtc Special Buses To Sabarimala How Much Is The Full Package
TSRTC: శబరిమలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఫుల్ ప్యాకేజీ ఎంతంటే?
శబరిమలకు వెళ్లే భక్తులకోసం తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ శుభవార్త చెప్పింది. ఫుల్ ఫ్యాకేజీతో ఎంజీబీఎస్ నుంచి బస్సులను అందుబాటులో ఉంచనుంది. దీంతో అయ్యప్పలకు ప్రయాణం ఈజీ కానుంది.
TSRTC special buses to Sabarimala.. How much is the full package?
TSRTC: అయ్యప్పస్వామి భక్తులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) ఓ మంచి ప్రయాణ ప్యాకేజీని తీసుకొచ్చింది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు శబరిమలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. జనవరి 5వ తేదీ నుంచి బస్సు సర్వీస్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. దీనికోసం టిక్కెట్ ధర రూ.13,600గా నిర్ణయించింది.
మొదటి రోజు సాయంత్రం 3 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు స్టార్ట్ అవుతుంది.
రెండో రోజు సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో కాణిపాకం చేరుకొని.. తిరిగి రాత్రి 10.40 గంటలకు బయలుదేరుతుంది.
మూడో రోజు ఉదయం 6.30 గంటలకు గురువాయూర్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ప్రయాణం మొదలు పెడుతుంది.
నాలుగో రోజు రాత్రి 11.20 గంటలకు ఎరుమలై చేరుకొని.. తిరిగి మరుసటి రోజు ఉదయం 8.20
స్టార్ట్ అవుతుంది.
ఉదయం 9.20 గంటలకు పంబకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
ఐదో రోజున ఉదయం 5.20 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. ఉదయం గం.9.20 గంటలకు బస్సు తిరిగి స్టార్ట్ అవుతుంది.
ఆరో రోజున ఉదయం ఏడున్నర గంటలకు అరుణాచలం చేరుకొని… తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది.
అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు మధురై చేరుకుంటుంది. తిరిగి రాత్రి 11.20 గంటలకు బయలుదేరుతుంది.
ఆ తర్వాత కంచికి వెళ్తుంది.
ఏడో రోజున ఉదయం 11.10 గంటలకు మహానంది చేరుకుంటుంది. రాత్రి 11.30 తిరిగి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది.
#TSRTC 's Sabarimala Special Buses: A divine odyssey connecting devotees to every temple on the route. Embrace the spiritual journey, one sacred stop at a time.