CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) హైదరాబాద్ కు వచ్చారు. బేగం పేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత కేసీఆర్(KCR) నివాసానికి వెళ్లారు. గత నెల ప్రమాదవశాత్తు జారిపడడంతో కేసీఆర్‌కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారహిల్స్‌లోని ఆయన ఇంటికి చేరుకొని కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేటీఆర్‌తో సహా పలువురితో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి బయలుదేరనున్నారు. లోటస్ పాండ్ లో ఉన్న తన తల్లి విజయమ్మను జగన్ కలవనున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్తుండటం విశేషం. దీంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.