కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించడంతో కోలీవుడ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో విజయ్ చివరి సినిమా గురించి చర్చ జరుగుతోంది.
Vijay: ఫైనల్‌గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పొలిటికల్ పార్టీని ప్రకటించాడు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడులోని ఏ ప్రాంతీయ పార్టీకి గాని వ్యక్తులకి గాని మద్దతు ఇవ్వడం లేదని.. తమ కొత్త పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తామని అన్నారు. అయితే విజయ్ రాజకీయ పార్టీ ప్రకటనతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అయినప్పటికీ.. ఇక పై విజయ్ సినిమాలకు దూరమవుతాడనేది ఆయన అభిమానులకు కాస్త బాధ కలిగించే విషయమే. చివరగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ‘లియో’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు విజయ్.
ఈ సినిమానే విజయ్ లాస్ట్ ఫిల్మ్ అనే ప్రచారం జరిగింది. కానీ లియో తర్వాత వెంకట్ ప్రభుతో తన 68వ సినిమాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కార్తిక్ సుబ్బరాజ్‌తో 69వ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత విజయ్ 70వ సినిమాను తెలుగు ప్రొడక్షన్ హౌజ్‌లో చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు తెలుగు దర్శకుడు డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. లేదంటే.. 70వ సినిమాకు శంకర్ డైరెక్టర్ అనే టాక్ కూడా ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని సమాచారం. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేయనున్నాడు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు విజయ్ ఈ సినిమాలు కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. మరి రాజకీయంగా విజయ్ ఎలా రాణిస్తాడో చూడాలి.