Family Star: ఎట్టకేలకు దేవర పోస్ట్‌పోన్ అవుతుందా? లేదా? అనే డైలమాలో ఉన్న నందమూరి అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసినట్టే. గత కొన్ని రోజులుగా దేవర వాయిదా పడిందనే వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కొరటాల టీమ్ నుంచి అఫిషీయల్ అప్టేట్ లేదు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం దేవర వాయిదా పై క్లారిటీ ఇచ్చేశారు. ఏప్రిల్ 5న దేవర రాకపోతే.. ఆ డేట్లో తమ ఫ్యామిలీ స్టార్ సినిమా వస్తుందని.. రీసెంట్‌గానే కన్ఫర్మ్ చేశారు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అనుకున్నట్టుగానే ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వస్తున్నట్టుగా ప్రకటించారు. గీతా గోవిందం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ, పరుశురాం కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇక దేవర ప్లేస్‌లో రౌడీ రాక ఫిక్స్ అయింది కాబట్టి.. అనఫిషీయల్గా దేవర పోస్ట్ పోన్ అయిపోయినట్టే. ఇందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. దేవర టీమ్ నుంచి కన్ఫర్మేషన్ లేకుండా దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి దేవర వాయిదా పడినట్టే. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా దేవర కొత్త డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అతి త్వరలోనే దేవర కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం దేవర షూటింగ్ బ్రేక్‌లో ఉంది. విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు షూటింగ్లో గాయాలు అవడంతో బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే తిరిగి దేవర షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి దేవర రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి.