»Chandrababu Ec Should Respond To Incidents Of Violence During Polling
Chandrababu: పోలింగ్‌లో జరిగే హింసాత్మక ఘటనలపై ఈసీ స్పందించాలి
రాష్ట్రంలో చాలా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Chandrababu: EC should respond to incidents of violence during polling
Chandrababu: రాష్ట్రంలో చాలా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవడం లేదని, శాంతిభద్రతలను కాపాడలేకపోయారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఈసీ వెంటనే స్పందించాలని, పోలింగ్‌ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబు ఓటు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని, భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారని చంద్రబాబు అన్నారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారితో పాటు విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారన్నారు.