మోస్ట్ అవైటేడ్ ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో.. ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. తాజాగా హీరోయిన్ దీపిక పదుకొనే వర్క్ కంప్లీట్ అయిందట.
Kalki 2898AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల కారణంగా ఈ సినిమా సీజి వర్క్ కాస్త ఆగిపోయిందని రీసెంట్‌గానే చెప్పుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్.. వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే దీపిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. తాజాగా దీపిక ‘కల్కి’లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేసినట్టుగా సమాచారం. అయితే.. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో రిలీజ్ అవుతుండగా.. దీపిక మాత్రం హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కల్కి సినిమాకు సంబంధించి దీపిక పనైపోయినట్టేనని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌కు మాత్రం దీపిక కాస్త దూరంగా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రెగ్నెన్సీ కారణంగా ఇలా చేస్తోందని సమాచారం.
ఇక ఈ సినిమాలో దీపికతో పాటు దిశా పటానీ కూడా మరో హీరోయిన్గా నటిస్తోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కల్కి ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేసేంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వైజయంతీ మూవీస్ వారు. మరి కల్కి ఎలా ఉంటుందో చూడాలి.