రాజమౌళి తర్వాత ఆ రేంజ్ పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. కెజియఫ్ సిరీస్‌తో సంచలనం సృష్టించగా.. సలార్‌తో ప్రభాస్‌కు సూపర్ కంబ్యాక్ సినిమా ఇచ్చాడు. తాజాగా సలార్2, కెజియఫ్ చాప్టర్ 3 గురించి సాలిడ్ అప్టేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.
Salaar 2, KGF 3 ready.. Prashant Neil Solid Update!
Prashant Neel: సలార్ 2 ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సమ్మర్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందనే వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అప్డేట్ బయటికి రాలేదు. కానీ చిత్ర యూనిట్ మాత్రం మే నెల చివర్లో సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుందని చెబుతు వచ్చారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఫైనల్ చేసేశాడు. రీసెంట్గా ఓ ఇంటరాక్షన్‌లో భాగంగా మాట్లాడుతూ.. సలార్ 2 షూటింగ్‌కు రెడీ అవుతున్నామని కన్ఫామ్ చేశాడు ప్రశాంత్ నీల్. అలాగే కెజియఫ్ 3 పై కూడా సూపర్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే కెజియఫ్ 3 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. కాకపోతే ఇప్పుడు యష్‌కి ఉన్న కమిట్మెంట్స్, అలాగే ప్రొడ్యూసర్ విజయ్‌కి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా.. ఈ సినిమా చేయడానికి కాస్త సమయం పడుతుంది.. అని తెలిపాడు.
కానీ ఖచ్చితంగా కెజియఫ్ చాప్టర్ 3 ఉంటుందని చెప్పేశాడు. అయితే.. మళ్లీ సలార్ నుంచి కెజియఫ్లోకి రావడానికి తాను కొంచెం బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నాను.. అని అన్నాడు. అందుకే ముందు సలార్ 2 పూర్తి చేసి.. ఆ తరువాత కేజీయఫ్ 3 చేస్తానని తెలిపాడు. దీనితో నీల్ కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే.. సలార్ 2 తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది ప్రశాంత్ నీల్. వచ్చే అక్టోబర్‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. కాబట్టి.. ఆ తర్వాతే కెజియఫ్ 3 ఉంటుందని చెప్పాలి. ఏదేమైనా.. సలార్ 2, ఎన్టీఆర్ 31, కెజియఫ్ చాప్టర్ 3 కోసం యావత్ సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.