చేసింది నాలుగు సినిమాలు.. కానీ పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో అతని అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం డైలమాలో ఉంటూ డైలమాలో పడేశాడు.
Prabhas, NTR.. Prashant Neil in dilemma? What is he doing?
Prabhas: సలార్ సినిమా రిలీజ్ అయి ఆరు నెలలు కావొస్తుంది. అయినా కూడా ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. వాస్తవానికైతే.. సలార్ పార్ట్ 1 రిలీజ్ అయ్యాక సలార్ 2 ఉంటుందనే క్లారిటీ అందరికీ ఉండేది. కానీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఆగష్టు నుంచే సెట్స్ పైకి వెళ్తుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక్కడి నుంచే ఫ్యాన్స్ డైలమాలో పడిపోయారు. ఎందుకంటే.. సమ్మర్లోనే సలార్ 2 షూటింగ్ ఉంటుందని.. కల్కి రిలీజ్ అయ్యాక ప్రభాస్ షూటింగ్లో జాయిన్ అవుతాడనే మాట వినిపించింది. కానీ ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రశాంత్ నీల్ నుంచి ఎలాంటి న్యూస్ బయటికి రావడం లేదు. దీంతో ముందు సలార్ 2 ఉంటుందా? లేదంటే ఎన్టీఆర్ సినిమా ఉంటుందా? అని ఎటు తేల్చుకోలేకపోతున్నారు అభిమానులు. నీల్ కూడా ఈ విషయంలో డైలమాలోనే ఉన్నట్టున్నాడు.
లేదంటే.. ఈపాటికే ఏదో ఒక క్లారిటీ వచ్చేసింది. అసలు ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడు? ఏ సినిమా స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడు? సలార్ 2, ఎన్టీఆర్ సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేశాడా? అనేది తెలియకుండా ఉంది. ప్రస్తుతానికి ప్రభాస్ మాత్రం కల్కి ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. హీరోలు తమ పని తాము చేసుకుంటు పోతున్నారు. కానీ ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడనేది ప్రశ్నార్థంగా మారింది. కానీ నీల్ మాత్రం గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎప్పుడైనా ప్రశాంత్ నీల్ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ రావొచ్చు. కాబట్టి.. ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.