NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ప్రీపోన్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర.. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల అక్టోబర్‌కు దేవర పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు ప్రీ పోన్ కానుందనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
NTR: ప్రస్తుతానికైతే దేవర రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర థియేటర్లోకి రావడం పక్కా. కానీ ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి మూవీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా రెండు వారాల గ్యాప్‌లో థియేటర్లోకి రాబోతున్నాయి. సెప్టెంబర్ 27న ఓజి రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే.. ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. దేవరను ప్రీపోన్ చేస్తూ.. సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేలా ముందుగానే ప్రీపెర్ అవుతున్నారట మేకర్స్. ఒకవేళ ఓజి షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే.. దేవర ముందుకొచ్చే అవకాశాలు నిండుగా ఉన్నాయని అంటున్నారు. సెప్టెంబర్ 27న దేవర వస్తే.. పాన్ ఇండియా లెవల్లో దసరా హాలిడేస్ కలిసి రానున్నాయి.
అందుకే.. ముందు జాగ్రత్తగా జూలై వరకు దేవర షూటింగ్ పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడట కొరటాల. ఓజి ఏమాత్రం వాయిదా పడే ఛాన్స్ ఉన్నా.. దేవర ఆ డేట్‌ను వదులుకునేలా లేదట. అయితే.. ఓజి ప్లేస్‌లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ వస్తుందనే టాక్ ఉంది. కానీ ఇండియన్ 2 జూలైకి వెళ్లడంతో.. గేమ్ చేంజర్ డిసెంబర్‌కి వెళ్లినట్టుగా చెబుతున్నారు. కాబట్టి.. సెప్టెంబర్ 27 వస్తే ఓజి, లేదంటే దేవర రావడం పక్కా అంటున్నారు. ఇప్పటికే దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రజెంట్ ముంబైలో వార్ 2తో బిజీగా ఉన్నాడు టైగర్. తిరిగా రాగానే దేవర షూటింగ్లో జాయిన్ అవనున్నాడు. అన్నట్టు.. మే 20న దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.