Mahesh Babu: నిజమా? ప్రభాస్ ‘కల్కి’ కోసం రంగంలోకి మహేష్ బాబు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని రంగంలోకి దించుతున్నారు? అనే న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ మహేష్‌తో నిజంగానే కల్కి కోసం అలా చేయిస్తున్నారా?
Mahesh Babu: ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావిడి జోరుగా ఉంది. అయితే.. మే 13న ఎలక్షన్స్ అయిపోగానే.. కల్కి సందడి స్టార్ట్ కానుంది. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి 2898ఏడి జూన్ 27న రిలీజ్ కానుంది. దీంతో.. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే.. ఈ సినిమాలో ఇప్పటికే భారీ స్టార్ క్యాస్టింగ్ ఉంది. దీపిక పదుకొనే, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు యంగ్ హీరోలు దుల్కర్ సల్మాన్, న్యాచురల్ స్టార్ నాని కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. కింగ్ నాగార్జున పేరు కూడా వినిపిస్తోంది.
అయితే.. ఇప్పుడు కల్కి సినిమా కోసం మహేష్ బాబు కూడా రంగంలోకి దిగుతున్నాడనే రూమర్ ఒకటి వైరల్‌గా మారింది. అంటే, మహేష్ బాబు కల్కి సినిమాలో గెస్ట్ రోల్ కాదు.. కానీ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడనే టాక్ ఊపందుకుంది. ప్రభాస్ విష్ణు అవతారానికి సంబంధించిన పాత్ర కోసం మహేష్ వాయిస్ ఓవర్ అందిస్తాడు.. అంటూ కొన్ని పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో అసలు నిజం లేదని అంటున్నారు. ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేనని అంటున్నారు. కాబట్టి.. కల్కి కోసం మహేష్ బాబు అనే న్యూస్ ఫేక్ అనే చెప్పాలి. ఇకపోతే.. కల్కి సినిమాను నాగ్ అశ్విన్ ఊహకందని విధంగా తెరకెక్కిస్తుండగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నారు. మరి కల్కి ఎలా ఉంటుందో చూడాలి.