టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, కృతిశెట్టి జంటగా కలిసి నటిస్తున్న మనమే చిత్రం టీజర్ విడుదల అయ్యింది. మంచివాడిలా కనిపించే బ్యాడ్ బాయ్ నేను అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Maname Teaser: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, కృతిశెట్టి జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మనమే. ఒకే ఒక జీవితం సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ ఇప్పుడు మనమేతో ప్రేక్షకులను అలరించనున్నారు.ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని ఈ చిత్రంపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా షుటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రానున్న ఈ చిత్రం నుంచి ఒక పాట రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మూవీ టీం తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్‌ను చూస్తుంటే లండన్, యూరప్ బ్యాక్‌డ్రాప్‌పై కథ సాగుతున్నట్లు తెలుస్తుంది. మంచివాడిగా కనిపించే బ్యాడ్ బాయ్ నేను అంటూ టీజ్ మొదలు అయి.. ఇద్దరిలో ఒకే ఏడవండి అనే డైలాగ్‌తో ఎండ్ అవుతుంది. అయితే అనుకోకుండా హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది. అలా వాళ్ల జీవితంలో ఓ బాబు వస్తాడు. ఆ బాబుకు హీరోకు ఏదైనా సంబంధం ఉందా? అసలు బాబు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి ఉందా? బాబు వచ్చాక వాళ్ల లైఫ్ ఎలా సాగింది? అనే విషయాలపై సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. టీజర్లో హీరో శర్వానంద్ చాలా స్టైలిష్‌గా కనిపించారు. హీరోయిన్ కృతిశెట్టి కూడా అందంగా గుడ్ లుక్‌లో కనిపించారు. మరి ఈ చిత్రం శర్వానంద్‌కి మంచి హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.