»Strange Noises In Bhadrachalam Temple Scared Devotees
Bhadrachalam temple: భద్రాచలం ఆలయంలో వింత శబ్దాలు.. భయపడుతున్న భక్తులు
భద్రాచలం రాముల వారి ఆలయంలో వింత శబ్ధాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తూర్పు మెట్లవైపు విమానం వెళ్తున్నట్లు పెద్ద శబ్దాలు వస్తుండంతో అందరూ భయపడుతున్నారు.
Strange noises in Bhadrachalam temple.. Scared devotees
Bhadrachalam temple: భద్రాచలం రాముల వారి ఆలయంలో వింత శబ్ధాలను భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఉదయం స్వామిని దర్శించుకున్న తరువాత తూర్పు మెట్లవైపు వెళ్లిన భక్తులకు ఓ విమానం దగ్గర నుంచి వెళ్లితే వచ్చిన సౌండ్ వినిపించింది. నిజాంగానే విమానం వస్తుందేమో అని అటు ఇటు చూశారు. దాంతో భక్తులు ఈ శబ్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆందోళన చెందారు. గుడి అర్చకులకు చెప్పారు. వారు కూాడా ఈ శబ్దాల మర్మం తెలియక ఆశ్చర్యపోయారు. భక్తులతో సహా ఆలయ అధికారులు వీటిని కనిపెట్టడాని ప్రయత్నించారు.
అయితే తూర్పు మెట్ల సమీపంలో జలప్రసాదం ఉంది. దీనికి నీరు సరఫరా చేసేందుకు కింద పైపులు అమర్చారు. దానిలో గాలి ఒత్తిడి వలన ఇలాంటి శబ్దాలు వచ్చే అవకాశం ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ప్రాకరంలో నీటి పైపులు లీక్ అవడం వనల ఇలాంటి శబ్దాలు వచ్చే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే పైపులో నీటి ప్రవాహం కొత్తగా చేసేది కాదు. ఎన్నో ఏళ్లుగా ఉంది మరీ ఇప్పుడే ఈ శబ్దాలు రావడానికి గల కారణం కచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ శబ్దం ఎంటని, ఎక్కడి నుంచి వస్తుందో త్వరగా కనిపెట్టాలని భక్తులు కోరుతున్నారు.