ప్రస్తుతం యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా బర్త్ డే జోష్‌లో ఉన్నారు. మే 20న తారక్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ భారీ విరాళం అనే న్యూస్ ఒకటి కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది.
NTR: NTR's huge donation.. Why to the village temple?
NTR: ఎన్టీఆర్ విరాళానికి సంబంధించిన న్యూస్ ఒకటి కాస్త లేట్‌గా బయటికొచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్.. 12 లక్షల 50 వేల రూపాయలు విరాళం ఇచ్చాడు. గుడి బయట దాతల పేర్లను శిలాఫలకం రాయించగా.. ఎన్టీఆర్‌తో పాటు భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని పేర్లు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే.. ఎన్టీఆర్ ఈ విరాళం ఇచ్చిన సంగతి ఆలయ నిర్మాణం పూర్తి అయినంత వరకు ఎవరికీ తెలియక పోవడం విశేషం. మరి ఈ గుడికే ఎన్టీఆర్ ఎందుకు విరాళం ఇచ్చాడు? ఆ ఊరితో తారక్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఆ ఊరితో ఎన్టీఆర్ ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయని తెలుస్తోంది. తరచుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్తు ఉంటారని సమాచారం. అందుకే.. ఎన్టీఆర్‌ను అడిగిన వెంటనే, గుడికి ఎంత ఖర్చు అయితే అంత ఇస్తానని చెప్పాడట.
చాలా రోజుల క్రితమే ఈ విరాళం ఇచ్చేశాడట. కానీ శిలాఫలకానికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో.. ఈ న్యూస్ కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది. కానీ ఎన్టీఆర్ టీమ్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. ఇదే కాదు.. ఎన్టీఆర్ ఇలాంటి సహాయాలు చాలానే చేశాడని, కానీ పబ్లిసిటీ పెద్దగా ఇష్టం ఉండదని అంటున్నారు నందమూరి అభిమానులు. ఇకపోతే.. ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. మే 20న యంగ్ టైగర్ బర్త్ డే ఉంది. ఆరోజు కొత్త సినిమాలు అప్టేట్స్ బయటికి రానున్నాయి.