కలియుద దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఇలా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
Thirumala: తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుంచి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. అంతే కాకుండా వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో జనాలు తిరుమలను సందర్శించారు. ఇప్పటికీ అదే రద్ది కొనసాగుతుంది. వెంకన్నను దర్శించుకోవడానికి భక్తులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఇలా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో స్వామిని దర్శించుకోవాడానికి సమయం తగ్గనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను రద్దు చేసింది. అది ఎన్నికల కోడులో భాగమే అన్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. దీంతో మళ్లీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని టీటీడీ ఎన్నికల కమిషన్ను అభ్యర్థించింది. ఇక మంగళవారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. గతంలో మాదిరిగానే రోజుకు పది వీఐపీ బ్రేక్ దర్శనాలు, పది రూ. 300 ఎస్ఈడీ టికెట్ల దర్శనాలను అనుమతి ఇస్తున్నారు. వీటితో పాటు ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను జారీ చేస్తున్నారు.