Kamakhya Temple: నాలుగు రోజుల తరువాత తెరుచుకున్న కామాఖ్యాదేవి ఆలయం
కామాఖ్యాదేవి ఆలయం ఈరోజు తెరిచారు. అంబుబూచీ జాతర సందర్భంగా నాలుగు రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ రోజు ఉదయం ఆలయం తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kamakhya Temple: భారతదేశంలో శక్తిపీఠాల్లో కామాఖ్యాదేవి అమ్మవారు ఒకరు. ప్రస్తుతం కామాఖ్యాదేవి ఆలయంను(Kamakhya Temple) తెరిచారు. అంబుబాచీ జాతరను పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు ఈ ఆలయాన్ని మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి ఆలయ ద్వారాలను ఓపెన్ చేశారు. ప్రతీ సంవత్సరం ఈ సమయంలో ఆలయాన్ని 4 రోజులు మూసివేస్తారు. ఎందుకంటే వార్షిక రుతుస్త్రావం సమయంలో అంబుబాచీ మేళాను నిర్వహిస్తారు. ఆ తరువాత ముగింపు పూజలు చేస్తారు. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి ముగింపు పూజలు జరిపారు. భక్తులకు మాత్రం బుధవారం ఉదయం నుంచి ఆలయాన్ని తెరిచారు.
జూన్ 22 నుంచి అంబుబాచీ మేళా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది స్థానిక ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ జాతర నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అలాగే నిర్వహించారు. దాదాపు 25 లక్షల మంది అంబుబాచీ మేళాకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ముందు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తరువాత గుడి పరిసరాల్లోనే అంబుబాచీ మేళా నిర్వహిస్తారు. భారీగా వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తారు.
Jai Maa Kamakhya!!🙏🙏🙏🚩 The door of Maa Kamakhya temple has been reopened today after performing some sacred rituals by the priests. May Aadyashakti Bhagavati protect Her devotees n bless everyone with power, prosperity n good health. #AmbubachiNirbritti🙏 pic.twitter.com/5bE3JOLy7i