»Real Fighting Of Elephants In Kerala Temple Many Injured Video Viral
Elephant Fighting: ఏనుగుల రియల్ ఫైటింగ్.. పలువురికి గాయాలు.. వీడియో వైరల్
ఉత్సవవిగ్రహాలను ఊరేగించడానికి తీసుకొచ్చిన రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Real fighting of elephants in Kerala temple.. many injured.. Video viral
Elephant Fighting: ఒక ఆలయంలో విగ్రహాలను ఊరెగించడానికి తీసుకొచ్చిన ఏనుగులు బీభత్సం చేశాయి. దాంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఆ తొక్కిసలాటలో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన కేరళ (Kerala) రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలోని అరట్టుపుజ ఆలయంలో చోటు చేసుకుంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలను తరలించే క్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను తీసుకురాగా అందులో ఒక ఏనుగు బీభత్సం సృష్టించి మరో ఏనుగుపై దాడి చేసింది.
అరట్టుపుజ ఆలయంలో శుక్రవారం రాత్రి ఆరాజ్ ఆచార ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న గురువాయూర్ ఆలయానికి చెందిన ప్రధాన ఏనుగు రవికృష్ణన్ ఒక్కసారిగా ఘింకరించింది. తోటి గజరాజుపై దాడి చేసింది. మావటిని సైతం కిందపడేసి దాడి చేసింది. భక్తులు భయాందోళనకు గురయ్యారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పరుగులు తీశారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎలిఫెంట్ స్వ్కాడ్ అక్కడికి చేరుకొని చాలా సమయం కష్టపడి వాటిని కంట్రోల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.