కృష్ణా: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి గుడ్లవల్లేరు మండల పరిషత్‌కు వచ్చిన పుష్ కార్ట్‌లను ఎంపీడీవో ఎం.డీ ఇమ్రాన్ చేతుల మీదుగా మండలంలోని పంచాయతీలకు శనివారం పంపిణీ చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం,చెత్తను శాస్త్రీయంగా సేకరించి, స్వచ్ఛ గ్రామాల లక్ష్యాన్ని సాధించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎంపీడీవో తెలిపారు.