»Pm Modi Becomes 1st Foreign Head To Receive Bhutans Highest Civilian Award
PM Modi : మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన దీన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ చదివేయండి.
PM Modi Bhutan Visit : రెండు రోజుల పర్యటన కోసం భూటాన్( Bhutan) వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రభుత్వం భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని(highest civilian award) ఇచ్చి సత్కరించింది. భూటాన్ రోజు జిగ్మేఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్.. మోదీకి ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పో పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డుకు అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా మోదీ నిలిచారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(PM narendra Modi) ఈ పురస్కారాన్ని 2021లోనే భూటాన్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, కోవిడ్ సమయంలో టీకాలు అందించడం వంటి సహకారాలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించింది. ఈ పురస్కారాన్ని అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా ఉందని మోదీ తెలిపారు. దీన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
పురస్కారాన్ని అందుకున్న తర్వాత మోదీ మాట్లాడుతూ.. తన జీవితంలో ఈ రోజు చాలా బిగ్ డే అన్నారు. ప్రతి అవార్డూ ప్రత్యేకమైనదే కాని భూటాన్ తనకు అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చి గౌరవించిందన్నారు. మరొక దేశం నుంచి ఈ గౌరవాన్ని అందుకున్నప్పుడు ఆ రెండు దేశాలు కలిసి పయనిస్తున్నాయన్నదానికి ఇది ఒక నిదర్శనమన్నారు. ప్రతి భారతీయుడి తరఫున తాను ఈ గౌరవాన్ని అంగీకరిస్తున్నానన్నారు. ఈ పురస్కారం తనకు ఇచ్చినందుకు కోట్లాది ధన్యవాదాలు అంటూ మోదీ చెప్పుకొచ్చారు.