స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరో ఘనత సాధించాడు. టీ 20 కెరియర్లో 12000 పరుగుల మైలు రాయిని సాధించాడు. తొందరగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
RCB Kohli : రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన కెరియర్లో మరో మైలు రాయిని సాధించాడు. కెరీర్లో 12000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొత్తం 360 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ ఘనతను దక్కించుకున్నాడు. 41.21 యావరేజ్, 133.42 స్ట్రైక్ రేట్ తో ఈ రికార్డును సాదించాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ 343 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించాడు.
ఇక కోహ్లీ తర్వాతి స్థానాల్లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, విండీస్ క్రికెటర్ పోలార్డ్, ఇంగ్లాండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్ తదితరులు ఉన్నారు. కోహ్లీ చేసిన 12 వేల పరుగుల్లో 4037 టీమ్ ఇండియా తరఫున చేసినవి. ఆర్సీబీ తరఫున 7693, ఇతర టోర్నీల్లో 270 పరుగులు సాధించాడు. టీమ్ ఇండియా ప్లేయర్లలో రోహిత్ శర్మ ఇప్పటికి 11,156 పరుగులు చేసి కోహ్లీకి దగ్గర్లో ఉన్నాడు. విరాట్ టీ20 కెరియర్లో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. అందులో ఏడు ఐపీఎల్లో చేసినవే. మొత్తంగా టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లలో ఆరో స్థానంలో ఉన్నాడు. క్రిస్‌గేల్ 14462 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.