AP: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరెంట్ వివాదం సర్దుమణిగింది. కనకదుర్గమ్మ ఆలయంలో గంటపాటు పవర్ కట్ అయ్యింది. అయితే, ఆలయ అధికారులు జనరేటర్ల సాయంతో దర్శనాలు కొనసాగించారు. విద్యుత్ అధికారులతో ఈవో చర్చల తర్వాత కరెంట్ సరఫరా పునరుద్ధరించారు. అయితే, రెండేళ్ల క్రితం ఏపీ విద్యుత్ మండలి, ఇంద్రకీలాద్రి దేవస్థానం మధ్య జరిగిన కరెంట్ సరఫరా ఒప్పందంపై ఈ వివాదం తలెత్తినట్లు సమాచారం.