గత నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాల పైనే నడుస్తుంది. ఈరోజు తాజాగా శాంతిభద్రతల పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చేసిన విధానాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందు అసెంబ్లీలో చుడనివి, విననవి..
వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ను ఎంత అపహాస్యం చేసారో వివరిస్తూ… గత ప్రభుత్వంలో కేసులు వున్నవారు ఎంత మంది? లేచి ఒకసారి నిలబడండి అని కోరగా… సభలో 90% మంది లేచి నిలబడ్డారు. లేచిన వారిలో పవన్ కళ్యాణ్, లోకేష్ సహా ముఖ్య నేతలు అందరూ ఉన్నారు. ఈ సంఘటన అసెంబ్లీలో కాసేపు నవ్వులు పూయించ్చింది.
ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేస్తూ… తప్పు చేసిన వారు ఎంతటివారైనా క్షమించకూడదు… చివరకు నేను తప్పు చేసిన నన్ను కూడా శిక్షించండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు అభినందించారు… ఈ విషయాన్నీ ఆన్ రికార్డు చెబుతున్న అంటూ పవన్ ను పొగడ్తలతో ముంచెత్తారు
ఇక ఇదే చర్చలో నాపై 17 కేసులు, పవన్ పై 7 తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను జైలు లో వున్నప్పుడు పవన్ కళ్యాణ్ నిరసన తెలిపితే ఎంత ఇబ్బందులకు గురిచేసారు పవర్ పాయింట్ ద్వారా చంద్రబాబు వివరించారు